DRDO Entry Test: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐవారికి 1901 ప్రభుత్వ ఉద్యోగాలు. డీఆర్‌డీఓ ఎంట్రీ టెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DRDO Entry Test: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ)లో 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు ‘సెంటర్ ఫర్ పర్సనల్ ట్యాలెంట్ మేనేజ్‌మెంట్'(సీఈపీటీఏఎం: సెప్టమ్) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ మేరకు సెప్టమ్.. డీఆర్‌డీఓ ఎంట్రీ టెస్ట్ నిర్వహించనుంది. ముఖ్యంగా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తారు. ఒకటి.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ(ఎస్‌టీఏ-బీ). రెండు.. టెక్నీషియన్-ఏ(టెక్-ఏ). సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కొలువులు 1075 ఉండగా టెక్నీషియన్ ఉద్యోగాలు 826 ఉన్నాయి. మొత్తం 1901.
ముందుగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కొలువుల వివరాలు చూద్దాం. వేతన శ్రేణి రూ.35,400-1,12,400. సైన్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా చేసినవాళ్లు అర్హులు. ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎంఎల్‌టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్‌టైల్, జువాలజీ సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మినహాయింపు ఉంది. టయర్-1(సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టయర్-2(సీబీటీ) సెలక్షన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్-ఏ కొలువుల వివరాలకు వస్తే.. వేతన శ్రేణి రూ.19,900-63200. టెన్త్, ఐటీఐవారు అర్హులు. ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సీఎన్‌సీ ఆపరేటర్, సీఓపీఏ, డ్రాట్స్‌మ్యాన్(మెకానికల్), డీటీపీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైండర్, మెషినిస్ట్, మెకానిక్(డీజిల్), మిల్‌రైట్ మెకానిక్, మోటర్ మెకానిక్, పెయింటర్, ఫొటోగ్రాఫర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్ ట్రేడ్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. టయర్-1(సీబీటీ)-సెలక్షన్ టెస్ట్, టయర్-2-ట్రేడ్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. పూర్తి వివరాలకు ఇవాళ్టి డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్, 03-09 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. డీఆర్‌డీఓలో పనిచేసేందుకు, తద్వారా దేశ సేవ చేసేందుకు ఇదొక సువర్ణావకాశమని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..