NTV Telugu Site icon

NCERT: మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు..త్వరలో మార్కెట్లోకి పుస్తకాలు

Dharmendra Pradhan

Dharmendra Pradhan

ఎన్‌సీఈఆర్‌టీ మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు చేసింది. సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, చైర్మన్‌లు కూడా పాల్గొన్నారు. 6వ తరగతి కొత్త పుస్తకాలు ఏప్రిల్‌ నుంచి బోధించాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు కొత్త సిలబస్‌ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో లేవు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2024-25 అకడమిక్ సెషన్ నుంచి 3 మరియు 6 తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెడతామని గతంలో ప్రకటించింది.

READ MORE: Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా

ఎనిమిది కొత్త పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి..
పుస్తకాల్లో మార్పులు చేసే పనులు చివరి దశలో ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. 3, 6 తరగతులకు సంబంధించిన తొమ్మిది పుస్తకాలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అకడమిక్ సెషన్ మధ్యలో 6వ తరగతికి కొత్త ఇంగ్లీష్, హిందీ పుస్తకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ సైన్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి మిగిలిన సబ్జెక్టుల పుస్తకాలు ఇంకా సిద్ధంగా లేవు. సీబీఎస్సీ(CBSE) పాఠశాలలు NCF సిఫార్సులను అనుసరించాలని సూచించింది. సాధ్యమైన చోట బహుభాషావాదం, కళల-సమగ్ర అభ్యాసం, అనుభవపూర్వక అభ్యాసం, బోధనా ప్రణాళికలు వంటి అభ్యాసాలను పొందుపరచాలని తెలిపింది. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా పుస్తకాలను రూపొందించనున్నారు.