ASRB Recruitment 2026: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రెడీ.. మంచి జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASRB Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపిక మండలి (Agricultural Scientists Recruitment Board – ASRB) మొత్తం 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 18, 2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబర్ 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 18 నుంచి 20 వరకు దరఖాస్తు ఫారంలో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ వివరాల కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపిక మండలి త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత విషయానికి వస్తే.. పోస్టులను అనుసరించి నిర్దేశించిన విద్యార్హతల్లో అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతన శ్రేణి (Pay Scale): T-3: లెవల్-5 (రూ. 29,200 – 92,300/-); T-4: లెవల్-6 (రూ. 35,400 – 1,12,400/-)
Also Read
- UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
- Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
- RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
దరఖాస్తు ఫీజు.. అన్రిజర్వ్డ్ (Unreserved) – ఒక్కపోస్ట్ కు రూ. 300- రెండు పోస్టులకు రూ. 600, EWS, OBC- ఒక్కపోస్ట్ కు రూ. 150- రెండు పోస్టులకు రూ. 300. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), దివ్యాంగులు (Persons with Benchmark Disabilities), మహిళలు, ట్రాన్స్జెండర్లు, మాజీ సైనికోద్యోగులకు (Ex-Servicemen) దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
తాజావార్తలు
-
ASRB Recruitment 2026: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రెడీ.. మంచి జీతం
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!