Site icon NTV Telugu

PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం

Jobs

Jobs

బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా? ఐటీ జాబ్స్ కు బదులు ఇతర ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీచేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఆఫీసర్ క్రెడిట్ 250, ఆఫీసర్ ఇండస్ట్రీ 75, మేనేజర్ ఐటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 ఫోస్టులున్నాయి.

Also Read:Kishan Reddy: త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుంది..

ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 21 నుంచి 38 ఏళ్లు కలిగి ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ఆఫీసర్-క్రెడిట్ రూ. 48,480 నుంచి రూ. 85,920, ఆఫీసర్-ఇండస్ట్రీ రూ. 48,480 నుంచి రూ. 85,920, మేనేజర్-ఐటి రూ. 64,820 నుంచి రూ. 93,960, సీనియర్ మేనేజర్-ఐటి, రూ. 85,920 నుంచి రూ. 1,05,280 ఉంటుంది.

Also Read:IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో లైవ్ స్ట్రీమింగ్

మేనేజర్-డేటా సైంటిస్ట్ రూ. 64,820 నుంచి రూ. 93,960, సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్, రూ. 85,920 నుంచి రూ. 1,05,280, మేనేజర్-సైబర్ సెక్యూరిటీ రూ. 64,820 నుంచి రూ. 93,960, సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ రూ. 85,920 నుంచి రూ. 1,05,280 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ. 59, ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 1180 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version