ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ రావడం అంటే ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముంటుంది. మీరు డిగ్రీ పాసై జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.
Also Read:Sandeep Reddy : డైరెక్టర్ కంటే ఐఏఎస్ అవ్వడం ఎంతో ఈజీ
ఐపీపీబీ భర్తీచేయనున్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అభ్యర్థులు డిగ్రీ పాసైతే చాలు. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ వ్యవధితో భర్తీ చేస్తారు. గరిష్ట కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read:IND vs NZ: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల జీతం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.150 దరఖాస్తుఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.