NTV Telugu Site icon

Indian Coast Guard Recruitment 2025: డిగ్రీ అవసరం లేదు.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 300 నావిక్ జాబ్స్ రెడీ..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే లక్షలాది మంది పోటీపడుతుంటారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీకే రావొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వరకు మాత్రమే దరఖాస్తు గడువు ఉండగా తాజగా మార్చి 3 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు.

Also Read:CM Chandrababu: టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

భర్తీకానున్న పోస్టుల్లో నావిక్(జనరల్ డ్యూటీ) 260, నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్)40 పోస్టులున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ నియామకాలను కోస్ట్ గార్డ్ ఎన్ రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT) ద్వారా నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు పోటీపడే వారు నావిక్ (GD) కోసం అభ్యర్థులు భౌతిక శాస్త్రం, గణితం తప్పనిసరి సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. నావిక్ (DB) కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Also Read:DeepSeek: చైనాలో ప్రతీ ఇంట్లోకి దూరిపోతున్న ‘‘డీప్ సీక్’’..

ఈ పోస్టులకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 21,700- రూ. 69100 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 300 చెల్లించాలి. SC/STలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 3 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.