బ్యాంక్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏళ్ల తరబడి బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్‌కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 2025 జనవరి 1 నాటికి 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది. ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:CM Chandrababau: వైఎస్ వివేక మరణంపై సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేతనం అందిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST కేటగిరీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు రూ. 600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. PH కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 15 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.