NTV Telugu Site icon

AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి

Aai

Aai

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని నాన్-ఎగ్జిక్యూటివ్ (సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) 2, సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) 4, సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) 21, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) 11, జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) 168 పోస్టులున్నాయి.

Also Read:Viral Video: అంతరిక్షంలో బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? ఈ వీడియో చూడండి..

సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టులకు పోటీపడే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు మార్చి 24, 2025 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 36,000 – రూ. 1,10,000 వరకు జీతం అందిస్తారు.

Also Read:MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..

జూనియర్ అసిస్టెంట్ కు నెలకు రూ. 31,000 – రూ. 92,000 జీతం ఉంటుంది. జనరల్, OBC (NCL), EWS, మాజీ అగ్నివీర్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనికులు, AAIలో ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసిన అప్రెంటిస్‌లు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు మార్చి 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.