NTV Telugu Site icon

Sri Chaitanya: సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్‌తో శ్రీ చైతన్య మరో మైలురాయి..

Sri Chaitanya

Sri Chaitanya

భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థలుగా పేరు ప్రఖ్యాతి పొందిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి. నవంబర్ 6న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్‌లో 20 రాష్ట్రాల నుండి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులు 310 సంవత్సరాల లోపు చిన్నారులే కావడం విశేషం. ఈ ఈవెంట్‌కు UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ప్రతిభ కనపరిచిన చిన్నారులకు అభినందనలు తెలియజేసి ప్రశంశా పత్రాలు అందజేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ పథకాన్ని ప్రధానం చేశారు.

CM Revanth: యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి

ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా తమ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత విద్యారంగ చరిత్రలో అద్భుత ఘట్టమని చిన్నారుల ప్రతిభను కొనియాడారు. 2018లో 2.5-5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో సాధించిన అద్భుతమైన ఫీట్ గురించి.. 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి, 10 రాష్ట్రాలలో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించిన విద్యార్థుల గురించి.. 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుండి 100 వరకు గుణకార పట్టికలను పఠించిన నాటి ప్రపంచ రికార్డులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది కేవలం 100 రోజుల్లో తమ అధ్యాపకులు ఇచ్చిన అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినందుకు తాము గర్వపడుతున్నామన్నారు. ఇది మన విద్యా వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Dil Raju : టాలీవుడ్ హీరోకి స్టేజిపైనే దిల్ రాజు షాకింగ్ కౌంటర్

39 సంవత్సరాలకు పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో విజయాలను సొంతం చేసుకోవడంలో శ్రీ చైతన్య స్కూల్ స్థాయి నుండే సమగ్ర శిక్షణ పద్ధతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు.. ఆధునిక వనరులు విద్యా రంగంలో ఎన్నో మైలురాళ్లను అదిగమించేలా చేశాయని అన్నారు. అంతేకాకుండా ఒలింపియాడ్స్, IIT JEE & NEETలో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ JEE మెయిన్, JEE అడ్వాన్స్‌డ్, NEET పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్లను సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొని జాతిగర్వించే విశ్వవిజేతలను అందిస్తోంది శ్రీ చైతన్య. ఈ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ తమ విద్యా సంస్థ ప్రతిభ, కృషి గుర్తింపు అని.. ఈ సందర్భంగా తమ విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, ప్రపంచస్థాయి గుర్తింపునిచ్చిన UK వరల్డ్ ‘బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Show comments