Site icon NTV Telugu

Macaque monkey: కోతిపిల్ల పుడితేనే సంతోషం వ్యక్తం చేస్తున్న జూ. అధికారులు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటీ..?

Monkey

Monkey

Macaque monkey: సామాన్యంగా మనుషులకు బిడ్డలు జన్మనిస్తే సంతోషపడతారు కానీ.. అక్కడ కోతి పిల్ల పుడితే సంతోషిస్తున్నారు. అదేంటీ అక్కడ మనుషుల కన్నా కోతులే ఎక్కవనా అంటే అవునని అంటున్నారు అక్కడి జూపార్క్ అధికారులు. అయితే అక్కడ జంతువుల వేట కావొచ్చు, అటవీ క్షయం వల్ల కావొచ్చు.. దానివల్ల కోతుల సంఖ్య తగ్గిపోయింది.

Read Also: MLA Prakash Goud : రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

అసలు వివరాల్లోకి వెళ్తే.. బ్రిటీష్ జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది ప్రపంచంలోని అత్యంత అంతరించిపోతున్న ప్రైమేట్స్‌లో ఒకదాని పుట్టుకను జరుపుకున్నారు. అరుదైన సులవేసి క్రెస్టెడ్ మకాక్ కోతి మే 16న చెస్టర్ జూలో ఓ కోతిపిల్లకు జన్మనిచ్చింది. ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్‌ జాతి కోతుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మకాక్ కోతుల సంఖ్య 5 వేల కంటే దిగువకు పడిపోయింది. దాంతో వాటి సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Read Also: Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం

ఈ క్రమంలో బ్రిటన్‌లోని చెస్టర్‌ జూలో మకాక్‌ కోతి పిల్ల పుట్టడం సంతోషించదగ్గ పరిణామంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా జూ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ జూలో మకాక్‌ జాతి కోతిపిల్ల జన్మించడం మకాక్‌ జాతి కోతుల సంరక్షణ కోసం చేపట్టిన గ్లోబల్‌ బ్రీడింగ్‌ కార్యక్రమానికి శుభపరిణామమని చెస్టర్‌ జూ క్షీరదాల విభాగం అధ్యక్షుడు మార్క్‌ బ్రే షా అన్నారు.

Exit mobile version