Site icon NTV Telugu

Zohran Mamdani: జవహర్‌లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం

Zohran Mamdani5

Zohran Mamdani5

న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మమ్దానీ విజయం వెనుక చాలా చరిత్రనే ఉంది. ఇతడు ఇండియన్-అమెరికన్ కావడం కూడా విశేషం.

ఇది కూడా చదవండి: Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ

ఇక మేయర్‌గా విజయం సాధించిన తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి జోహ్రాన్ మమ్దానీ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూను జ్ఞాపకం చేసుకుని ప్రసంగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన సందర్భంగా నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ‘‘ట్రిస్ట్ విత్ డిస్టనీ’’ నుంచి ప్రేరణ పొందినట్లుగా మమ్దానీ తెలిపారు. శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి 1947, ఆగస్టు 14న నెహ్రూ ప్రసంగించారు. ప్రసంగంలో త్యాగాలు, ఒక యుగం ముగింపు, భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తాజాగా మమ్దానీ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి

‘‘మీ ముందు నిలబడి నేను జవహర్‌లాల్ నెహ్రూ మాటలను గుర్తుచేసుకుంటున్నాను. చరిత్రలో ఒక క్షణం అరుదుగా వస్తుంది. మనం పాత నుంచి కొత్త వైపు అడుగు పెట్టినప్పుడు.. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేయబడిన ఒక దేశం యొక్క ఆత్మ ఉద్భవిస్తోంది. ఈ రాత్రి మనం పాత నుంచి కొత్త యుగం వైపు అడుగు పెట్టాము.’’ అని నెహ్రూ మాటలను మమ్దానీ గుర్తుచేశారు.

ఈ విజయం న్యూయార్క్‌కు కొత్త శకానికి ప్రతీక అని, ధైర్యంగా నాయకత్వం వహించమని హామీ ఇచ్చారని మమ్దానీ పేర్కొన్నారు. ‘‘మనం చాలా పిరికివాళ్ళమని చెప్పడానికి సాకుల జాబితా కాకుండా.. మనం ఏమి సాధిస్తామో అనే ధైర్యమైన దృష్టిని.. న్యూయార్క్ వాసులు తమ నాయకుల నుంచి ఆశించే యుగం ఇది.’’ అని మమ్దానీ అన్నారు.

మమ్దానీ బ్యాగ్రౌండ్
మమ్దానీ.. అక్టోబర్ 18, 1991లో జన్మించారు. ఉగాండాలోని కంపాలాలో పుట్టారు. విద్యావేత్త మహమూద్ మమ్దానీ, చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దానీ ఐదేళ్ల వయసులో సౌతాఫ్రికాకు వచ్చారు. అనంతరం ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు.

మమ్దానీ భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్-అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యూఎస్, దుబాయ్‌లో ఎక్కువ కాలం గడిపారు. ఖతార్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అనంతరంత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్‌మండ్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు.

దువాజీ.. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హింజ్ ద్వారా మమ్దానీని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.

 

Exit mobile version