న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మమ్దానీ విజయం వెనుక చాలా చరిత్రనే ఉంది. ఇతడు ఇండియన్-అమెరికన్ కావడం కూడా విశేషం.