NTV Telugu Site icon

Most Miserable Country: అత్యంత “దుర్భరమైన దేశం”గా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?

Most Miserable Country

Most Miserable Country

Most Miserable Country: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది. యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ వంటి దేశాలను దాటుకుని జింబాబ్వే ఈ అగౌరవ స్థానంలో నిలిచింది. ద్రవ్యోల్భణం, పెరుగుతున్న నిత్యావసర రేట్లతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ద్రవ్యోల్భణం 243.8 శాతానికి చేరుకుంది.

Read Also: Canada: “రన్నింగ్ చేస్తే తీవ్రమైన అలర్జీ”.. అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళ..

మొత్తం ప్రపంచంలోని 157 దేశాలపై ఈ ర్యాకింగ్స్ వెల్లడించారు. అధికి నిరుద్యోగం, ద్రవ్యోల్భనం, అధిక రుణరేట్లు, ప్రజల్లో రక్త హీనత ఇలా జింబాబ్వేను కుదిపేస్తున్నాయి. జింబాబ్వే తర్వాత 15 స్థానాల్లో వరసగా వెనిజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు ఉన్నాయి.

ఈ ఇండెక్స్ ప్రకారం యూరప్ దేశం స్విట్జర్లాండ్ అత్యంత మెరుగైన స్థితిలో ఉంది. HAMI ఇండెక్స్ లో అతి తక్కువ స్కోర్ కలిగి ఉంది. రెండో సంతోషకరమైన దేశంగా కువైట్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా 103వ స్థానంలో ఉంది. ఇండియాలో నిరుద్యోగం ఈ ర్యాంకుకు కారణమవుతోంది. అమెరికా ఈ జాబితాలో 134వ స్థానంలో, వరల్డ్ హ్యపీనెస్ రిపోర్ట్ లో వరసగా ఆరేళ్లుగా ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న ఫిన్లాండ్ ఈ దేశంలో 109వ స్థానంలో ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, బ్యాంకు వడ్డీరేట్లు, తలసరి వాస్తవ జీడీపీ అంశాల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు.