Site icon NTV Telugu

Zelenskyy: యుద్ధంలో చనిపోయిన ఉత్తర కొరియా సైనికుల ముఖాలను రష్యా కాల్చేస్తుంది..

Zelensky

Zelensky

Zelenskyy: రష్యా తరఫున తమపై యుద్ధం చేస్తూ మరణించిన నార్త్ కొరియా సైనికుల ముఖాలను గుర్తు పట్టకుండా రష్యా కాల్చేస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించాడు. కుర్స్క్‌ రీజియన్‌లో పాతిపెట్టడానికి ముందు పుతిన్‌ సేనలు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాయని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో యుద్ధంలో చనిపోయిన కొరియా సైనికులను కాల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపాడు

Read Also: Star Boy : ప్రభాస్ సినిమాను ఢీ కొట్టనున్న సిద్దు జొన్నలగడ్డ

అయితే, గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యాకు విరక్తి రాకపోగా.. ఇలాంటి దారుణాలను చూస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌ పైకి నార్త్ కొరియా సైనికులను పంపించడమే కాకుండా.. వారి మరణాలను కూడా దాచడానికి మాస్కో యత్నిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎలాంటి కారణం లేకుండా ఉత్తర కొరియా సైనికులు పుతిన్ కోసం పోరాటం చేస్తున్నారని తెలిపాడు. కానీ వారిని రష్యా తీవ్రంగా అవమానిస్తుందన్నాడు. ఇలాంటి పిచ్చితనాన్ని తక్షణమే ఆపాలి.. రష్యాను జవాబుదారీగా శాంతి ప్రక్రియ ద్వారానే ఇది ఆగిపోతుందని జెలెన్‌స్కీ వెల్లడించారు.

Exit mobile version