Zelensky Slams Elon Musk’s Russia Peace Plan: ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి కోసం కొన్ని ప్రతిపాదనలు చేశారు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్. అయితే మస్క్ చేసిన ప్రతిపాదనలపై మండి పడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ. బుధవారం న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జెలన్ స్కీ మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు యుద్ధ పరిస్థితి తెలియాలంటే ఉక్రెయిన్ వచ్చి చూడాలని సూచించారు. రష్యా, ఉక్రెయిన్ లో ఏం చేసిందనేది అప్పుడు అర్థం అవుతుందని జెలన్ స్కీ అన్నారు. ఇది చూసిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో, ఎవరు ప్రారంభించారో, ఎప్పుడు ముగించాలనే విషయాలను మీరే నాకు చెబుతారంటూ జెలన్ స్కీ అన్నారు.
Read Also: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరాభాస్కర్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మూడు ప్రతిపాదనను ట్విట్టర్ లో సూచించారు. దీనిపై పోల్ కూడా నిర్వహించారు. 1) రష్యా ఆక్రమిత( లుహాన్స్క్, డొనెట్స్క్, జపొరిజ్జియా, ఖేర్సన్) ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి.2) క్రిమియాను రష్యాకు అప్పగించాలి. 3) ఉక్రెయిన్ కు తటస్థ హోదా కల్పించాలని ట్వీట్ చేశారు. దీనిపై పోల్ కూడా నిర్వహించారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై ఉక్రెయిన్ అధికారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్ కు రిఫ్లైగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ.. మీకు రష్యాకు మద్దతు ఇచ్చే ఎలాన్ మస్క్ ఇష్టమా..?, ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చే ఎలాన్ మస్క్ ఇష్టమా..? అని పోల్ నిర్వహించాడు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయిన రష్యా-ఉక్రెయిన్ వార్ తొమ్మిదో నెలకు చేరింది. అయినా కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. మరో వైపు రష్యా, ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. మరోవైపు చర్చలకు తాము సిద్ధమే అని రష్యా ప్రకటించింది. అయితే.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత కాలం ఉక్రెయిన్ చర్చల్లో పాల్గొనేదే లేదని జెలన్ స్కీ స్పష్టం చేశాడు.
