Site icon NTV Telugu

Ukraine Russia War: చ‌ర్చల‌కు సిద్ధమైన ఉక్రెయిన్‌

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్‌ సైన్యం, ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. మరోవైపు.. ఇప్పటికే తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. తాజాగా.. ర‌ష్యాతో చ‌ర్చల‌కు అంగీకారం తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కాగా, బెలార‌స్‌లో ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చలు జ‌ర‌గ‌నున్నాయ‌ని ర‌ష్యన్ మీడియా మాస్కోలో ప్రక‌టించింది. చ‌ర్చల కోసం బెలార‌స్‌కు ఉక్రెయిన్ బృందం బ‌య‌లుదేరింది. బెలార‌స్‌లోని గోమెల్‌లో ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చలు జ‌ర‌గ‌నున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత చర్చలకు వెళ్లడంతో ఇప్పటికే భారీగా నష్టం జరిగింది.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం.. ప్రాణభయంతో చాలా మంది దేశాన్ని వీడడం.. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Read Also: Maha Shivratri 2022: వేములవాడలో ఉత్సవాలు ప్రారంభం

Exit mobile version