బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కొందరు చేసే పనులు చూస్తుంటే చేసేవారికి ఎలాగుంటుందో తెలియదు గానీ.. చూసే వారికి మాత్రం ఒళ్లు మండుతుంది. విషయం ఏంటంటే.. కొందరు యువకులు కదులుతున్న రైలు బోగీలు ఎక్కి స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో వారి తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. మరి కొందరు వెరైటీగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నది. కాగా, 8 మంది వ్యక్తులు ఆ రైలు బోగీలపైన ఉన్నారు.
ముగ్గురు దానిపై పరుగెత్తగా, మరో వ్యక్తి స్కిపింగ్ చేశాడు. మరి కొందరు రైలు బోగి టాప్‌పై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నిల్చొని ఉండగా, ఒకరిద్దరు కూర్చొని ఉన్నారు. కాగా, ఆ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నప్పుడు సమీపంలోని ఎత్తైన బిల్డింగ్ నుంచి ఒకరు ఈ వీడియో తీశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..కాగా, ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.
వీడియో చాలా దూరం నుంచి రికార్డ్ చేయడంతో అందులోని వ్యక్తులను గుర్తించడం కష్టంగా ఉందన్నారు. అయితే నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా రైలుపై ప్రయాణించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆ వ్యక్తుల ప్రమాదకర స్టంట్లను కొందరు విమర్శించారు. 1980లో రైలు పైన ప్రయాణించడం అమెరికాలో కామన్ అని ఒకరు గుర్తు చేశారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంతో ఇలాంటి సాహసాలు ఇంకా ఎన్ని చూడాలో అన్ని ఒకరు చమత్కరించారు.
Yo WTF!? These people just came over the Williamsburg bridge on top of the train. pic.twitter.com/osEtX4a0cp
— GOOSE (@GooseyMane) June 11, 2022