NTV Telugu Site icon

యోగా పుట్టింది భారత్‌లో కాదు.. మా దేశంలోనే..!

KP Sharma Oli

KP Sharma Oli

వేద కాలంలో భారత్‌లోనే ఉన్న యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ లభిస్తోంది.. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అందరి దృష్టి వ్యాయామం, యోగా సాధనపై పడిపోయింది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోన్న సమయంలో.. యోగా పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. భార‌త్‌లో యోగా పుట్టలేదన్న ఆయన.. నేపాల్‌లోనే యోగా పుట్టింద‌ని చెప్పుకొచ్చారు.. భార‌త్ ఓ దేశంగా ఉనికిలోకి రాక‌ముందే నేపాల్ యోగాను అభ్యసించిందని పేర్కొన్న ఆయన.. యోగా క‌నుగొన్నకాలంలో అస‌లు భార‌త్ ఏర్పాటు కాలేద‌ని వ్యాఖ్యానించారు.. యోగా నేపాల్‌లో లేకుంటే ఉత్తరాఖండ్ ప‌రిస‌రాల్లో పుట్టుకొచ్చిందన్నారు ఓలి. అయితే, ప్రధాని న‌రేంద్ర మోడీ చొర‌వ‌తో అంత‌ర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించార్న ఆయన.. యోగాను క‌నుగొన్నందుకు త‌మ స‌న్యాసుల‌ను తాము ఏనాడూ ఆకాశానికి ఎత్తలేదని.. త‌మ వాద‌న‌ను స‌రైన రీతిలో ప్రపంచం ముందుంచ‌లేదన్నారు. ఇక, అంతేకాదు.. శ్రీరాముడు జన్మస్థలిపై మరోసారి వ్యాఖ్యలు చేశారు.. రాముడు అయోధ్యలో జ‌న్మించ‌లేద‌ని, నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా అయోధ్యపురి వ‌ద్ద వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.