Site icon NTV Telugu

XI Jinping: హిస్టరీ క్రియేట్ చేసిన జి జిన్ పింగ్.. మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు ఆయనకే..

Xi Jinping

Xi Jinping

Xi Jinping re-elected as General Secretary of Communist Party of China for record third term: చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మూడోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికై రికార్డ్ క్రియేట్ చేశారు. మరో ఐదేళ్ల పాటు పార్టీ అధినేతగా ఉండనున్నాదు. దీంతో ఆయనకు మూడోసారి చైనా అద్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. గతం చైనా శక్తివంతమైన నాయకుడిగా పేరుపొందిన మావో జెడాంగ్ మాత్రమే పార్టీకి రెండు పర్యాయాలు కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాల్లో పార్టీ జిన్ పింగ్ కి మరోసారి కార్యదర్శిగా పట్టం కట్టారు. దీంతో మార్చిలో జరగబోయే ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ ను అధికారికంగా మరోసారి చైనా అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. అంతకుముందు శక్తివంతమైన సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే చైనాలో నెంబర్ 2గా ఉన్న ప్రధాని లీకెకియాంగ్ కు ఉద్వాసన పలికారు. పలువురు సీనియర్లు సెంట్రల్ కమిటీలో చోటు సంపాదించలేకపోయారు. ఆదివారం రోజు అత్యంత కీలకమైన 25 సభ్యులతో కూడిని సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నారు.

Read Also: Ind Vs Pak: పాకిస్థాన్ హ్యాట్రిక్ కొడుతుందా? టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఎన్నిక అనంతరం బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో జిన్ పింగ్ మీడియాతో సమావేశం అయ్యారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రపంచానికి చైనా అవసరం’’ అని అన్నారు. నాపై నమ్మకం ఉంచినందుకు శ్రద్ధగా పనిచేస్తాననిన పార్టీ, ప్రజలకు మాటిచ్చారు. మనం అన్నింటిని తట్టుకుని నిలబడాలని, ధృడ సంకల్పంతో ఉండాలన్నారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జి జిన్ పింగ్ పేరు సంపాదించుకున్నారు. గతంలో పార్టీలో రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నియమం ఉండేది. అయితే 2018లో జిన్ పింగ్ ఈ నియమాన్ని రద్దు చేశాడు. దీంతో మూడోసారి, ఎన్నిసార్లైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడింది.

గత ఆదివారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభోపన్యాసంలో జిన్ పింగ్ కోవిడ్ నియంత్రణ, పార్టీ సాధించిన విజయాల గురించి చర్చించారు. ముఖ్యంగా తైవాన్ అంశంలో ఇతర దేశాల జోక్యాన్ని వ్యతిరేకించారు. దీంతో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా చైనా రాజ్యాంగంలో నిబంధనలు తీసుకువచ్చారు. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. తైవాన్ ను బలప్రయోగంతో అయినా వశం చేసుకుంటామని చైనా స్పష్టం చేసింది.

Exit mobile version