US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..
- అమెరికా-ఇరాన్ మధ్య చైనా శాంతి ప్రతిపాదన..
- 4-సూత్రాలను ప్రతిపాదించిన జిన్‌పింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్‌ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. సౌదీ అరేబియా పర్యటనలో సమయంలో జిన్‌పింగ్ ఈ ప్రతిపాదన చేశారు. మంగళవారం అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమై నాలుగు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించినట్లు చైనీస్ మీడియా పేర్కొంది.
Read Also: Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ప్రాంతీయ శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అభివృద్ధి-భద్రత సమన్వయం , అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం వంటి నాలుగు సూత్రాలను జిన్ పింగ్ ప్రతిపాదించారు. ‘‘అంతర్జాతీయ చట్టబద్ధమైన పాలన అధికారాన్ని మనం కాపాడాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడం, అనుకూలంగా లేనప్పుడు వదిలేయడం కుదరదు. అలాగే, ప్రపంచం తిరిగి అరాచక పాలనలోకి జారిపోవడానికి మనం అనుమతించలేము’’ అని జిన్ పింగ్ అన్నారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత, జిన్ పింగ్ యూఏఈ పర్యటన జరిగింది. యుద్ధం గురించి నేరుగా కామెంట్స్ చేయకున్నా పరోక్షంగా అమెరికా-ఇజ్రాయిల్‌ను సూచిస్తూ జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరోవైపు, వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!