Japan: ఎయిర్‌పోర్టులో పేలిన యూఎస్ బాంబు.. 87 విమానాలు రద్దు
- జపాన్‌లో ఊహించని ఘటన
- ఎయిర్‌పోర్టులో పేలిన WW-II యూఎస్ బాంబు
- 87 విమానాల రాకపోకలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకొంది. మియాజాకీ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు హఠాత్తుగా పేలింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం (WW-II) నాటి బాంబుగా జపాన్ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పాతి పెట్టిన ఈ బాంబు.. ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ రంధ్రం ఏర్పడింది. పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని అధికారులు చెప్పారు. గొయ్యి కారణంగా దాదాపు 87కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకారం… పేలుడు కారణంగా టాక్సీవే మధ్యలో ఏడు మీటర్ల (23 అడుగులు) వెడల్పు మరియు ఒక మీటరు (3.2 అడుగులు) లోతులో రంధ్రం ఏర్పడడం కారణంగా మియాజాకి విమానాశ్రయం రన్‌వేను మూసివేసినట్లు తెలిపారు. జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన బాంబు నిర్వీర్య బృందం.. పేలుడుకు కారణం భూమి ఉపరితలం క్రింద పాతిపెట్టిన అమెరికన్ బాంబు అని తేల్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. పేలుడు జరగడానికి కేవలం రెండు నిమిషాల ముందు ఒక విమానం సమీపంలోని టాక్సీలో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో కనిపించింది. మియాజాకి విమానాశ్రయంలో గతంలో పేలని అనేక బాంబులు దొరికాయని రవాణా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. వైమానిక దాడుల నుంచి పేలని బాంబులు నేటికీ జపాన్ అంతటా దొరుకుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 37.5 టన్నుల బరువున్న మొత్తం 2,348 బాంబులను నిర్వీర్యం చేసినట్లు ఆత్మరక్షణ దళాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Kishan Reddy: పేదల జోలికొస్తే ఖబర్దార్! .. హైడ్రా చర్యలపై కిషన్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!