NTV Telugu Site icon

Japan: ఎయిర్‌పోర్టులో పేలిన యూఎస్ బాంబు.. 87 విమానాలు రద్దు

Japan

Japan

జపాన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకొంది. మియాజాకీ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు హఠాత్తుగా పేలింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం (WW-II) నాటి బాంబుగా జపాన్‌ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పాతి పెట్టిన ఈ బాంబు.. ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ రంధ్రం ఏర్పడింది. పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని అధికారులు చెప్పారు. గొయ్యి కారణంగా దాదాపు 87కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..

జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకారం… పేలుడు కారణంగా టాక్సీవే మధ్యలో ఏడు మీటర్ల (23 అడుగులు) వెడల్పు మరియు ఒక మీటరు (3.2 అడుగులు) లోతులో రంధ్రం ఏర్పడడం కారణంగా మియాజాకి విమానాశ్రయం రన్‌వేను మూసివేసినట్లు తెలిపారు. జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన బాంబు నిర్వీర్య బృందం.. పేలుడుకు కారణం భూమి ఉపరితలం క్రింద పాతిపెట్టిన అమెరికన్ బాంబు అని తేల్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. పేలుడు జరగడానికి కేవలం రెండు నిమిషాల ముందు ఒక విమానం సమీపంలోని టాక్సీలో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో కనిపించింది. మియాజాకి విమానాశ్రయంలో గతంలో పేలని అనేక బాంబులు దొరికాయని రవాణా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. వైమానిక దాడుల నుంచి పేలని బాంబులు నేటికీ జపాన్ అంతటా దొరుకుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 37.5 టన్నుల బరువున్న మొత్తం 2,348 బాంబులను నిర్వీర్యం చేసినట్లు ఆత్మరక్షణ దళాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Kishan Reddy: పేదల జోలికొస్తే ఖబర్దార్! .. హైడ్రా చర్యలపై కిషన్ రెడ్డి ఫైర్

Show comments