NTV Telugu Site icon

England Bomb Explode: వరల్డ్ వార్ 2 నాటి బాంబ్.. డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు

England Bomb Explode

England Bomb Explode

World War II Bomb Explodes Unexpectedly In England Norfolk: ఇంగ్లండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబ్‌ను డిఫ్యూజ్ చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన పేలుడు కాదని, ఆ బాంబ్‌ని డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి బాంబులను గుర్తించినప్పుడు.. అక్కడి అధికారులు పక్కా ప్లాన్ వేసుకొని వాటిని, డిఫ్యూజ్ చేస్తుంటారు. ఒకవేళ డిఫ్యూజ్ చేయడానికి వీలు పడకపోతే.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని, వాటిని పేలుస్తారు.

Turkey Earthquake: టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య

ఈ క్రమంలోనే నార్ ఫోల్క్ కౌంటీలో వరల్డ్ వార్ 2 నాటి బాంబ్ ఉందని మంగళవారం అధికారులు గుర్తించారు. దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ప్రమాదంతో కూడుకున్న పని కావడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మనుషులతో కాకుండా, రోబోలతో బాంబ్‌ని డిఫ్యూజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ బాంబు పేలిపోయింది. తద్వారా అక్కడ భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసిన పోలీసులు.. ఆస్తినష్టం ఎంత జరిగిందన్న విషయంపై అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రమాదం లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జనాలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లొచ్చని వెల్లడించారు.

INDvsAUS 1st Test: మర్ఫీకి 7 వికెట్లు.. 141 ఏళ్ల రికార్డు బద్దలు

అయితే.. విస్ఫోటనం కారణంగా భారీగా దుమ్ము, ధూళి గాల్లోకి ఎగిసిపడింది. ఈ కారణంగా.. ఆ ప్రాంతంలో కాసేపు పొగ నిండిపోయింది. శకలాలు కూడా రోడ్డు మీదకి ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నార్ ఫోల్క్ అధికారులు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాల్ని మా డ్రోన్ కెమెరా రికార్డ్ చేసింది. అయితే.. అంతకుముందే అక్కడి నుంచి జనాల్ని తరలించడంతో, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాకపోతే ఈ ప్రాసెస్‌కి కొంత ఎక్కువ సమయం పట్టింది’’ అంటూ ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.

KTR V/s Bhatti: భట్టి పై కేటీఆర్ సెటైర్.. 9 నెలల్లో పిల్లులు వస్తారు కానీ..