Site icon NTV Telugu

PM Modi-Netanyahu: దేశం కోసం చాలా సాధించారు.. ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ వీడియో విడుదల

Netanyahu

Netanyahu

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఆయా దేశ ప్రధానులు వీడియోలు ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరోజు ముందే.. మంగళవారమే మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దాదాపు 3 నెలల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్ల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక మోడీ తనకు మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

నెతన్యాహు..
ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ నెతన్యాహు కొనియాడారు. భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాలు మంచి విజయాలను సాధించాయని నెతన్యాహు ప్రశ్నించారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ..
అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. అలాగే మోడీ మంచి స్నేహితుడు అంటూ తెలిపారు. భారతదేశంతో ఇంత బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియా స్వాగతిస్తుందన్నారు. ఇక ఆస్ట్రేలియాలో భారతదేశ సమాజం అందిస్తున్న అద్భుతమైన సహకారానికి ప్రతిరోజూ కృతజ్ఞతలమై ఉన్నట్లు చెప్పారు.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్
అలాగే న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కూడా విషెస్ చెప్పారు. బ్రిటన్‌కు మోడీ మంచి స్నేహితుడు అని కొనియాడారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

 

Exit mobile version