కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రియేసస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు వదిలేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. కోవిడ్ మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదన్నారు టెడ్రోస్.. ఇక, మన దగ్గర కరోనాను అంతం చేయడానికి కావాల్సినన్ని వనరులు ఉన్నాయి. ప్రభావవంతమైన ప్రజారోగ్య వనరులు, శక్తిమంతమైన మెడికల్ వనరులు కూడా ఉన్నాయని.. కానీ, ప్రపంచం వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ మిషన్‌కు, ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న వ్యాక్సిన్ సేకరణ కృషికి ప్రపంచదేశాలు సహకరించాలని కోరారు టెడ్రోస్.
Also Read
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!