World Health Organization About Monkeypox.
ఓ వైపు కరోనా రక్కసితో పోరాడుతున్న ప్రజలపై ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ దాడి చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోన్న మంకీపాక్స్.. రోజురోజుకూ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అంతేకాకుండా తాజాగా మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్‌వో కీలక విషయాలు వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ జెనీవాలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని, ఇది శృంగారం వల్లే కాకుండా.. ఇతర విషయాల్లో కూడా సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపారు.
మంకీపాక్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగిక సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు డాక్టర్ రోసముండ్ లూయిస్. ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, అయితే.. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చని డాక్టర్ రోసముండ్ లూయిస్ తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని రోసముండ్ లూయిస్ సూచించారు.