NTV Telugu Site icon

వారితోనే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి-ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO

WHO

కరోనా సెకండ్‌ వేవ్‌ భయాలు ఇంకా తొలగిపోకముందే.. మరో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. అదే కరోనా డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, దీని వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇక, భారత్‌ ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.. కానీ, కరోనా టీకాలు తీసుకోనివారిలో డెల్టా వేరియంట్ చాలా స్పీడ్‌గా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో.. ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా వేరియంట్‌ గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్‌ వెల్లడించారు.. ఈ సమయంలో కొన్ని దేశాల్లో కోవిడ్ కట్టడికి విధించిన నిబంధనలు సడలించడం కూడా ఆందోళనకరమే అంటున్నారు. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైందని.. ఇక, ఈ కేసులు పెరుగుతున్న కొద్దీ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరగడంతో పాటు.. ఆరోగ్య సేవలపై ఒత్తిడి వస్తుందని.. మరణాల ముప్పు కూడా పొంచిఉందని హెచ్చరించింది.. వ్యాక్సినేషన్‌తో డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఇక, వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు కూడా మాస్కులు ధరించడం, ఇతర కోవిడ్‌ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది..