Site icon NTV Telugu

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రపంచ బ్యాంకు

కొన్నిరోజులుగా అగ్రదేశం రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా దాడుల కారణంగా ఆ దేశం భారీగా నష్టపోతోంది. దీంతో ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు.

ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సాయంలో 350 మిలియన్​ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్​ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్​ డాలర్లు గ్రాంట్​ ఫైనాన్సింగ్​, 100 మిలియన్ డాలర్లు ఫైనాన్సింగ్​కోసం నిధులు కేటాయించారు. ఈ ప్యాకేజీ ఉక్రెయిన్ ప్రజలకు కీలకమైన సేవలను అందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఈ నగదును ఆసుపత్రి కార్మికులకు వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు, నిస్సహాయులకు సామాజిక కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు.

Exit mobile version