ప్రతి మనిషి కష్టపడేది డబ్బుకోసమే.. రోజు మొత్తం కష్టపడినా మహా అయితే ఎంత సంపాదించగలరు.. మధ్యతరగతి వారైతే ఓ రూ. 10 వేలు సంపాదించగలరు. కానీ ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తే 14 రోజులకు రూ.9 లక్షలు సంపాదించగలరు. కేవలం 14 రోజులకు రూ.9 లక్షలా.. అయితే అదెంత కష్టమైన పనో అనుకోని బెంబేలెత్తకండి.. అది చాలా సులువైన పని.. కానీ, అందులో ఒక షరతు ఉంది.. అది కనుక ఒప్పుకొంటే రూ.9 లక్షలు మీవే.. ఇంతకీ ఆ పని ఏంటి..? ఆ షరతు ఏంటి..? ఎక్కడ ఈ బంపర్ ఆఫర్ అనేది తెలుసుకుందాం
స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో ధనిక కుటుంబాలు చాలా ఎక్కువ. నిత్యం వారు విదేశాలు తిరుగుతూనే ఉంటారు. దీంతో ఇంట్లో వారి పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్స్ ని నియమించుకుంటారు. అయితే క్రిస్టమస్ సమయంలో ఎవరు పనులకు రారు. దీంతో ఓ ధనిక కుటుంబం ఒక కీలక నిర్ణయం తీసుకోంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు తమ పిల్లలను చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ కి ఏకంగా రూ.9 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో ఒక చిన్న షరతు పెట్టారు.. ఈ 14 రోజులు వారు ఇల్లు వదిలి బయటకు వెళ్ళకూడదు.. పిల్లలను వదిలి అస్సలు వెళ్లకూడదు.. వారికి ఏం కావాలన్నా చేసి పెట్టాలి.
తాము వచ్చేవరకు పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇదే వారి షరతు.. అంతేకాదు అక్కడికి వెళ్లే ముందు కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేసుకుని ఉండాలి. పోవడానికి, రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులన్నీ ఆ ఇంటివారే భరిస్తామని తెలిపారు. హా ఇదేం ఉంది పండగ తరువాత.. ముందు డబ్బు ముఖ్యం అని మనం వెళ్లిపోతాం.. కానీ, అక్కడ క్రిస్టమస్ ని ఎంతో పవిత్రంగా చేస్తారు. పండగ రోజు కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ బంపర్ ఆఫర్ ని ఎవరు స్వీకరించడంలేదట.. మరి కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఈ ఆఫర్ ని ఎవరు అందుకుంటారో చూడాలి.