NTV Telugu Site icon

4B movement: ‘‘మీతో సె*క్స్ చేయం’’.. ట్రంప్ గెలుపుకి మగాళ్లని నిందిస్తున్న మహిళలు..

4b Movement

4b Movement

4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చడం లేదు. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ, వాళ్ల కలలు డొనాల్డ్ ట్రంప్ విజయంతో చెరిగిపోయాయి. అయితే, ట్రంప్ విజయానికి మగవాళ్లే కారణం అంటూ అక్కడి మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. చాలా మంది మహిళలు పురుషులతో సె*క్స్, డేటింగ్, పిల్లలు కనడం వంటి వాటికి దూరంగా ఉండాలని 4B ఉద్యమంలో చేరారు.

నిజానికి ఎన్నికల సమయంలోనే కమలా హారిస్ క్యాంపెయిన్ ట్రంప్‌ని స్త్రీవాద వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించింది. అయితే, అఖండ మెజారిటీతో ట్రంప్ గెలవడంతో చాలా మంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది మహిళావాదులు ఈ ‘‘4B మూమెంట్’’లో చేరారు. ఇప్పుడు ఇది అమెరికాలో ట్రెండ్ అవుతోంది. పురుషులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఒక సెక్షన్ మహిళలు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.

Read Also: Thummala Nageswara Rao: రైతు రుణమాఫీపై క్లారిటీ.. అప్పటి లోపు పూర్తిగా మాఫీ

అసలు ‘‘4B మూమెంట్’’ ఏంటి..?

4B అనేది ‘‘ 4 నోస్’’ అని అర్థం. కొరియన్‌లో ‘‘Bi’’ అంటే ‘‘వద్దు’’ అనే అర్థం వస్తుంది. 2018లో సౌత్ కొరియాలో మొదలైంది. అక్కడి రాడికల్ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశారు. ఇది పురుషులతో ‘‘వివాహం,సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్’’ వంటివి వద్దు అనే నాలుగు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాయి.

అయితే, యూఎస్ ఎన్నికల్లో చాలా మంది మహిళలు తమ పునరుత్పత్తి హక్కుల్ని కాపాడే వ్యక్తి కమలా హారిస్ గెలవాలని కోరుకున్నారు. ట్రంప్ గెలవడంతో పురుషుల పాత్ర ఉందని భావిస్తున్న కొందరు మహిళలు ఈ ‘‘4B ఉద్యమం’’లో భాగస్వామ్యమయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు మహిళలు సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. ‘‘మహిళలు మరవకండి మనకు శక్తి ఉంది. మన శరీరాలను మగవారికి అప్పగించడం మన ఛాయిస్. దీన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు’’అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు 4బీ ఉద్యంలో పాల్గొన్న మహిళలపై మరో వర్గం మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మీరు ఒక వ్యక్తితో పడుకోవాలని అనుకోంటే, ఒక్క వ్యక్తి నిద్ర కూడా చెడిపోదు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

Show comments