NTV Telugu Site icon

Iran: హిజాబ్ ధిక్కరిస్తే మహిళలకు ఉరిశిక్ష.. ఇరాన్‌లో కొత్త చట్టాలు..

Iran

Iran

Iran: ఇరాన్‌లోని మత ప్రభుత్వం మహిళ హక్కుల్ని మరింతగా దిగజార్చే కొత్త చట్టాలను తీసుకువచ్చింది. మహిళలు హిజాబ్‌ వంటి నైతిక చట్టాలను కఠినంగా పాటించేందుకు ఈ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ వీటిని ధిక్కరిస్తే మరణశిక్ష లేదా 15 ఏళ్ల వరకు జైలుశిక్షతో సహా కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. “పవిత్రత , హిజాబ్ సంస్కృతి”ని ప్రోత్సహించేందుకు ఈ చట్టాలను ఇరాన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో ఆమోదించారు. ఈ చట్టాలు ‘‘నగ్నత్వం, అసభ్యతను వ్యతిరేకిస్తూ పూర్తిగా దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహిస్తుంది’’. నేరస్తులకు భారీ నగదు జరిమానాలు, కొరడా దెబ్బలు, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ది గార్డియన్ ప్రకారం.. కొత్త నైతికత చట్టాలు ద్వారా ఎవరైనా సరైన డ్రెస్సింగ్‌ని ప్రోత్సహించేలా ప్రచారం చేసేలా విదేశీ సంస్థలు ఉదాహరణకు అంతర్జాతీయ మీడియా, ఇతర సమాజ సంస్థలకు తమ ఫోటోలు, సరైన డ్రెస్సింగ్ లేని వీడియోలను పంపించడం వంటివి చేస్తే 12,500 పౌండ్లు( రూ. 13.5 లక్షల) జరిమానా, కొరడా దెబ్బలు, మళ్లీ పునారావృతం అయితే, 5 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాలి. హిజాబ్ ఆదేశాలను పాటించపోవడం, నైతికత చట్టాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 296 ప్రకారం, “భూమిపై అవినీతి”గా పరిగణించబడే వ్యక్తులకు మరణశిక్ష విధించబడుతుంది.

Read Also: Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా

అమ్నేస్టి ఇంటర్నేషనల్ ప్రకారం.. ఇరాన్ కొత్త మెరాలిటీ చట్టాలు మహిళలు, బాలికలు తమ వీడియోలను విదేశీ మీడియాకు బహిర్గతం చేసినా, శాంతియుత నిరసనలో పాల్గొన్నా వారికి మరణశిక్షలు విధించడాన్ని సమర్థింస్తుందని చెప్పింది. వీటిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు కొత్త చట్టంలోని ఆర్టికల్ 60 ప్రకారం.. ‘‘మతపరమైన విధి’’లో భాగంగా మహిళలు నిర్బంధంగా హిజాబ్ వేసేలా చేసిన వారికి రక్షణ లభిస్తుంది.

ఇరాన్ వ్యాప్తంగా అక్కడి కఠినమైన మత చట్టాలపై వ్యతిరేకత పెరుగుతోంది. అయితే, కఠినమైన శిక్షలకు భయపడి జనాలు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ హిజాబ్ సరిగా ధరించలేదని మోరాలిటీ పోలీసులు దాడి చేయడంతో ఆమె మరణించింది. ఈ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అయితే, అక్కడి అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసింది. ఇందులో పాల్గొన్న కొందరికి మరణశిక్షలు అమలు చేసింది.