విమానంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో చెకింగ్‌లు.. ఎన్నో వివరాలు సేకరిస్తుంటారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే విమాన ప్రయాణానికి అవసరమైన పాస్. అలాంటిది ఎలాంటి బోర్డింగ్ పాస్ లేకుండానే ఓ మహిళ ఏకంగా న్యూయార్క్ నుంచి పారిస్‌కు ప్రయాణం చేసింది. చివరికి బాత్రూమ్‌లో సిబ్బందికి దొరికిపోయింది.
ఇది కూడా చదవండి: Sambhal Jama Masjid: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘సంభాల్ జామా మసీద్’’ వివాదం..
మంగళవారం న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి డెల్టా ఎయిర్ లైన్స్ విమానం పారిస్‌కు బయల్దేరింది. రాత్రి 11 గంటలకు డెల్టా ఫ్లైట్ 264లోకి ఒక మహిళ దొంగచాటుగా ప్రవేశించింది. పారిస్ వెళ్లేంత వరకు ఆమెను ఎవరూ గుర్తించకపోవడం విశేషం. న్యూయార్క్ నుంచి పారిస్ వరకూ ప్రయాణం పూర్తి చేసేసింది. ఇలా దాదాపు 7 గంటల ప్రయాణం చేసింది. అనంతరం బాత్రూమ్‌లో అనుమానిత వ్యక్తి ఉన్నట్లు సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. అయితే బోర్డింగ్ పాస్ లేని వ్యక్తి దగ్గర నిషేధిత వస్తువుల లేకపోవడంతో భద్రతా స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రెండు గుర్తింపు కార్డులతో బోర్డింగ్ స్టేజ్ దాటేసినట్లు కనుగొన్నట్లు రవాణా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ