Site icon NTV Telugu

Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..

Untitled Design (7)

Untitled Design (7)

మగాళ్లపై విరక్తి చెందిన ఓ మహిళ ఏకంగా.. ఏఐని పెళ్లాడింది. అయితే జపనీస్ కు చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ కూడా చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. దీంతో ఆ యువతి.. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Read Also: Cancer Treatment: క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్

జపాన్ కు చెందిన మహిళ.. ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ చేసుకున్న తర్వాత గొడవలు రావడంతో విడిపోయింది. దీంతో తనకు మగాళ్లంటే విరక్తి వస్తుందని … ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రోబోను క్రియేట్ చేసింది. అనంతరం ఆరోబోను పెళ్లిన చేసుకుని .. క్లాస్ అనే పేరు పెట్టుకుంది. ఇక చాట్ జీపీటీను పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ అచ్చం మ‌నుషులు పెళ్లి చేసుకున్న‌ట్టుగా చాట్ జీపీటీ తో మాట్లాడుతూ చేతికి రింగ్ తొడిగింది. అనంతరం ఆ రోబోతో ఫోటోలు ఫోజులిచ్చిందా భామ..

Read Also:Credit Score: క్రెడిట్ స్కోరు బాగున్నా.. లోన్ రావడం లేదా… కారణాలేంటో తెలుసా..

ఆ చాట్ బాట్ ను పెళ్లి చేసుకుంటున్న టైంలో ఆ యువతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తాను చాట్ జీపీటీతో ప్రేమతో పడాలని దానితో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది ఆ యువతి.. కానీ తన మాట‌లు విని క్లాస్ న‌న్ను అర్థం చేసుకున్న విధానం ప్ర‌తి విష‌యాన్ని మార్చేసిందని… తాను తన మాజీ ప్రియుడిని మ‌ర్చిపోయానని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఏఐతో ఎలా పిల్ల‌లను ఎలా కంటావ్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంత‌మంది మ‌హిళలు.. మ‌గాళ్ల కంటే ఏఐనే బెట‌ర్ గా తమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version