Site icon NTV Telugu

Gaming Addiction: అకౌంట్‌లో రూ.52 లక్షలకు కేవలం రూ.5 మిగిల్చింది.. ఓ కూతురి ఘనకార్యం..

Gaming Addiction

Gaming Addiction

Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. తల్లికి తెలియకుండా 13 ఏళ్ల కూతురు మొబైల్ గేమింగ్ కి అడిక్ట్ అయింది.

వాంగ్ అనే 13 ఏళ్ల బాలిక ఈ గేమ్స్ లో వాడే టూల్స్ కొనుగోలు చేసేందుకు తల్లి ఖాతా నుంచి లక్షల్లో డబ్బును వినియోగించింది. పే-టూ-ప్లే గేమ్స్ కి బానిస కావడాన్ని సదరు బాలిక టీచర్ గుర్తించి ఆమె తల్లికి తెలియజేసే వరకు తెలియలేదు. బాలిక ఆన్‌లైన్ గేమింగ్‌పై 449,500 యువాన్లు (సుమారు రూ. 52,19,809) ఖర్చు చేయడం ద్వారా నాలుగు నెలల్లో తన కుటుంబం సంపాదించిందంతా గేమ్స్ కోసం తగలేసింది. గేమ్స్ ని మరింత సమర్థవంతంగా ఆడేందుకు డబ్బులు ఖర్చు పెట్టి గేమింగ్ టూల్స్ కొనుగోలు చేసింది.

Read Also: Biparjoy Cyclome: ఉత్తర దిశగా కదులుతున్న బిపర్‌జోయ్ తుఫాను.. మత్స్యకారులకు హెచ్చరిక

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, పాఠశాల సమయంలో ఆమె అధిక ఫోన్ వాడకాన్ని బాలిక ఉపాధ్యాయురాలు గమనించి, ఆమె పే-టు-ప్లే గేమ్‌లకు బానిసై ఉండవచ్చని అనుమానించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు బాలిక తల్లికి సమాచారం అందించింది. అనుమానం వచ్చిన తల్లి తన బ్యాంక్ ఖాతా చూడగా.. రూ. 52 లక్షలకు బదులు కేవలం రూ. 5 మాత్రమే ఉండటం చూసి షాక్ అయింది. బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలిస్తే మొబైల్ గేమ్స్ కోసం డబ్బు వినియోగించినట్లు తేలింది.

గేమ్‌ల కొనుగోలు కోసం 120,000 యువాన్‌లు (సుమారు రూ. 13,93,828) మరియు గేమ్‌లో టూల్స్ కొనుగోళ్లకు అదనంగా 210,000 యువాన్‌లు (సుమారు రూ. 24,39,340) వెచ్చించినట్లు ఆమె అంగీకరించింది. ఇంకా, ఆమె తన సహవిద్యార్థుల్లో కనీసం 10 మంది కోసం గేమ్‌లను కొనుగోలు చేయడానికి మరో 100,000 యువాన్‌లను (దాదాపు రూ. 11,61,590) ఉపయోగించింది. బాలిక తల్లి డెబిల్ కార్డు దొరకగానే..తన స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసింది. తల్లి అందుబాటులో లేని సమయంలో కూతురు అవసరాల కోసం దాని పిన్ చెప్పింది. దీంతోనే సదరు బాలిక, తన తల్లి ఖాతా నుంచి డబ్బులను వాడుకున్నట్లు తేలింది. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెక్‌గిల్ విశ్వవిద్యాలయం 2022 విశ్లేషణ ప్రకారం, అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ బానిసలు చైనాలో ఉన్నారు. తరువాత సౌదీ అరేబియా, మలేషియా ఉన్నాయి.

Exit mobile version