Woman Fired For Calling In Sick On Mondays Wins 3 Lakh Payout: సోమవారం నాడే ఏదో ఒక కారణం చెప్తూ పదే పదే సెలవులు తీసుకుంటోందని.. ఒక సంస్థ ఓ యువతిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఖంగుతిన్న ఆ ఉద్యోగి, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కింది. ఈ కేసుని విచారించిన కోర్టు.. సంస్థదే తప్పు ఉందని తేల్చి, భారీ జరిమానా విధించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సెలిన్ థోర్లీ (25) అనే యువతి కార్డిఫ్ యూనివర్శిటీలోని స్టూడెంట్స్ యూనియన్‌లో క్రిస్టియన్ డొనెలీస్ నిర్వహిస్తున్న అక్యూట్ బార్బర్స్‌లో హెయిర్ డ్రెసర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేసిన నాలుగేళ్లలో.. ఆ యువతి ఎక్కువ సోమ, మంగళవారాల్లో సెలవులు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె బాస్ క్రిస్టియన్.. 2021 హాలోవీన్ ఈవెంట్ సమయంలో ఓ హెచ్చరిక జారీ చేశాడు. ‘‘హాలోవీన్ వీకెండ్‌ని ఎంజాయ్ చెయ్, కానీ సోమవారం మాత్రం తప్పకుండా విధుల్లోకి రావాలి’’ అని హెచ్చరించాడు. అందుకు ఆమె సరేనని ఒప్పుకుంది కూడా!
Education Fair: Exxeella Education Group అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
కానీ.. హాలోవీన్ పార్టీలో బాగా ఎంజాయ్ చేయడం కారణంగా సెలీన్ సోమవారం అనారోగ్యానికి గురైంది. రకరకాల వంటకాలు తినడం వల్ల.. కడుపునొప్పి కూడా వచ్చింది. దీంతో.. సోమవారం ఉదయం తన బాస్ క్రిస్టియన్‌కి తాను రాలేనని, తనకు లీవ్ కావాలని మెసేజ్ పెట్టింది. ‘‘హే క్రిస్, ఈ మెసేజ్ చదివాక నాపై కచ్ఛితంగా కోప్పడతావని తెలుసు. కానీ, నేను ఈరోజు విధుల్లోకి రాలేని పరిస్థితిలో ఉన్నా. నా ఆరోగ్యం ఇంతలా క్షీణిస్తుందని నేను ఊహించలేదు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. కడుపులోనూ చాలా గందరగోళంగా ఉంది. అసలు బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నా. నన్ను క్షమించండి’’ అని మెసేజ్ పెట్టింది. సోమవారం వచ్చిన ప్రతీసారి సెలీన్ లీవ్ పెడుతుందని కాబట్టి, ఈసారి కూడా లీవ్ కోసం అబద్ధం చెప్తోందని క్రిస్ అనుకున్నాడు. దాంతో.. విధుల్లోకి రావాల్సిందేనని, లేకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వలా చేస్తే, నేను లీగల్‌గా పోరాటం చేస్తానని ఆ అమ్మాయి హెచ్చరించింది. ఏం చేసుకుంటావో చేసుకోపో అని క్రిస్ బదులిచ్చాడు.
Meghalaya BJP Chief Ernest Mawrie: గొడ్డు మాంసంపై మేఘాలయ బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇంకేముంది.. ఆ మెసేజ్ చూశాక చిర్రెత్తుకొచ్చిన సెలీన్, కోర్టును ఆశ్రయించింది. విచారణలో భాగంగా.. సెలీన్ ఎక్కువభాగం సోమ లేదా మంగళవారాలు సెలవులు పెట్టిందని క్రిస్ కోర్టుకు తెలిపాడు. తన మొదటి సంవత్సరంలో అందరి కంటే లీవ్స్ పెట్టిందని కూడా చెప్పాడు. ఇందుకు కౌంటర్ ఇస్తూ.. క్రిస్ చెప్తున్నంత దారుణంగా తానేమీ సెలవులు తీసుకోలేదని వాదించింది. అంతేకాదు.. తాను ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నానని మెడికల్ రిపోర్టులు సమర్పించింది. ఇలా వాదోపవాదలు విన్న తర్వాత.. సెలీన్‌కి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెను ఉన్నపళంగా ఉద్యోగంలో నుంచి తొలగించడం కరెక్ట్ కాదని పేర్కొంటూ.. సెలీన్‌కు 3,453 పౌండ్లు (రూ. 3,43,499) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. కోర్టు ఆదేశాల ప్రకారం ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు క్రిస్ సిద్ధమయ్యాడు.
Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తు స్వాహా.. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే