Site icon NTV Telugu

బుద్దుందా.. ఎంత కోపం వస్తే మాత్రం ఇలాంటి పని చేస్తారా..?

సాధారణంగా కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే గట్టిగా అరుస్తారు.. లీడు అంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు. ఇంకా కొంచెం కోపిష్ఠులు అయితే మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం కోపంలో ఇద్దరి ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. తన కోపానికి ఎదుటువారిని బలిచేయడానికి సిద్ధమైంది. వారు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఘోరం జరిగిపోయింది. అసలు అంతలా ఆ మహిళకు కోపం తెప్పించేదెవరు..? అసలేం జరిగింది..? అనేది తెలుసుకుందాం రండి..

థాయ్ ల్యాండ్ కి చెందిన ఒక మహిళ ఒక బహుళ అంతస్థులో నివసిస్తోంది. ఇటీవల ఆ బిల్డింగ్ లో రిపేర్లు ఉండడంతో ఇద్దరు పెయింటర్లు పని చేయడానికి వచ్చారు. 26 వ అంతస్థుకి వెళ్లి వారి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఒక మహిళ రుసరుసలాడుకుంటూ వారివద్దకు వచ్చి.. నన్ను అడగకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ పైకి ఎందుకు వచ్చారంటూ రచ్చ మొదలుపెట్టింది. అంతేకాకుండా కోపంతో ఊగిపోతూ పెయింటర్లు వేలాడుతున్న తాడును కట్ చేసింది. దీంతో 26వ అంతస్థు నుంచి వారు గాల్లో వేలాడారు.

వినడానికే ఇంత భయంకరంగా ఉంటే .. గాల్లో వారు దాదాపు గంట అలాగే ఉండిపోయారు. వారిని చూసిన కొంతమంది స్థానికులు సహాయక సిబ్బందికి సమాచారం అందివ్వగా.. వారు వచ్చి పెయింటర్స్ ని రక్షించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సదురు మహిళను అరెస్ట్ చేశారు. అయితే అప్పుడు కూడా మహిళ తాను కావాలని తాడు కట్ చేయలేదని, అనుకోకుండా జరిగిందని కబుర్లు చెప్పింది. ఏది ఏమైనా మహిళ చేసింది పొరపాటేనని తెలిపి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అందుకే తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు మరి.

Exit mobile version