పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే అక్కడ మంత్రులు టీ తాగడాన్ని తగ్గించండి అనే స్థాయికి దిగజారింది. ఇతర దేశాల నుంచి ‘టీ’ దిగుమతి చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇక ఇంధన సమస్యతో విద్యుత్ వినియోగాన్ని తక్కువ చేయడానికి సాయంత్రం వరకే షాపులు, మార్కెట్లు తెరవాలని రాత్రి 10 తరువాత పెళ్లి వేడులకు జరపకూడదని ఆదేశాలు ఇస్తోంది అక్కడి సర్కార్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రధానులు, మాజీ ప్రధానుల భార్యల ఆస్తులపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాని షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కన్నా వారి భార్యలే ధనవంతులు అని అక్కడి డాన్ న్యూస్ పేపర్ తెలిపింది. ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన వివరాల ప్రకారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. ప్రధానులు ఆస్తుల వివరాలను పరిశీలిస్తే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు రూ. 2 లక్షల విలువ చేసే 4 మేకలు ఉన్నాయని.. వాటితో పాటు ఆరు అంతస్తుల భవనం, వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయిని.. ఇతర దేశాల్లో వాహనాలు, ఆస్తులు, వ్యాపారాలు లేవని డాన్ న్యూస్ పేపర్ తెలిపింది. పాక్ విదేశీ కరెన్సీ ఖాతాలో 3,29,196 యూఎస్ డాలర్లు, 518 పౌండ్లు, పాక్ కరెన్సీలో 60 మిలియన్ల రూపాయలు ఉన్నాయని తెలిపింది. ఇదే సమయంలో ఆయన భార్య బుష్రా బీబీ ఆస్తి 142.11 మిలియన్ల పాకిస్తాన్ రూపాయలుగా వెల్లడించింది.
ఇక ప్రస్తుత ప్రధాని షహజాబ్ షరీఫ్ విషయానికి వస్తే.. ఆయన మొదటి భార్య నుస్రత్ షెహబాజ్ భర్త కన్నా ధనవంతురాలు. ఆమెకు పాక్ కరెన్సీలో 230.29 మిలియన్ల ఆస్తి ఉంది. లాహోర్, హజారా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నాయి. విదేశాల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇక ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆస్తి విలువ పాక్ కరెన్సీ లో 141.78 మిలియన్లు గా ఉంది. షహబాజ్ షరీఫ్ రెండో బార్య టెహ్మీనా దుర్రానీ సంపద పీకేఆర్ 5.76 మిలియన్లు అని డాన్ వెల్లడించింది.