Site icon NTV Telugu

India Pakistan War: మాపై దాడి చేస్తే.. భారత్పై అణు బాంబులతో దాడి చేస్తామని పాక్ హెచ్చరిక

Pak

Pak

India Pakistan War: భారత్ ను రెచ్చగొట్టేలా రష్యాలోని పాకిస్తాన్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వ్యాఖ్యలు చేశాడు. రష్యాకు చెందిన ఛానల్‌ ఆర్‌టీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అతడు ఈ కామెంట్స్ చేశారు. పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని అన్నారు. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్లు మరికొన్ని లీక్ అయిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు. ఒకవేళ పాక్ పై దాడి జరిగితే ఆ తర్వాత భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ హెచ్చరించాడు.

Read Also: Heavy Rain In AP: ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. నీట్ అభ్యర్థులు ఇబ్బందులు!

ఇక, పాకిస్తాన్ పై భారతదేశం దాడికి పాల్పడిన వెంటనే అణు బాంబులను ప్రయోగిస్తామని పాక్ అంబాసిడర్ ఖలీద్ జమాలీ పేర్కొన్నాడు. అణ్వాయుధాలతో సహా తమ పూర్తి సైనిక ఆయుధాగారాన్ని ఉపయోగిస్తామని అన్నారు. ఇప్పటికే ఇస్లామాబాద్ కి రావాల్సిన సింధూ జలాల నిలిపివేసింది.. ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకుంది అంటే.. త్వరలోనే మాపై (పాకిస్తాన్) దాడులకు దిగే అవకాశం ఉందని రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వెల్లడించారు.

Exit mobile version