Site icon NTV Telugu

ఒక‌వైపు మ‌ద్ద‌తిస్తూనే… స‌రిహ‌ద్దుల వెంట పాక్ కంచెను నిర్మించ‌డానికి కార‌ణం?

తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పాక్ అక్క‌డ కొత్త‌గా ఏర్పాటు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఒక‌వైపు కొత్త ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెబుతూనే,  ఆఫ్ఘ‌నిస్తాన్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లో 2600 కిలోమీట‌ర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది.  2 మీట‌ర్ల వెడ‌ల్పు, 3.6 మీట‌ర్ల ఎత్తులో కంచెను నిర్మించింది.  అంతేకాదు, ఈ స‌రిహ‌ద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది.   కేవ‌లం 16 ప్రాంతాల నుంచి మాత్ర‌మే స‌రిహ‌ద్దులు దాటే ఏర్పాటు చేసింది.  ఒక‌ప్పుడు తాలిబ‌న్ వంటి ఉగ్ర‌వాదుల‌కు పాక్ స్వ‌ర్గ‌ధామంగా ఉండేది.  అయితే, తాలిబ‌న్‌లు పెషావ‌ర్‌లోని ఆర్మీ స్కూల్‌పై దాడి త‌రువాత ఆ తాలిబ‌న్ ఉగ్ర‌వాద సంస్థ‌పై పాక్ నిఘాను పెంచింది.  ఆఫ్ఘ‌న్-పాక్ స‌రిహ‌ద్దుల నుంచి శ‌ర‌ణార్దులు అత్య‌ధికంగా పాకిస్తాన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.  వీరితో పాటు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు పాక్‌లోని ప్ర‌వేశించి అరాచ‌కాలు సృష్టిస్తారేమో అనే భ‌యం ప‌ట్టుకుంది.  దీంతో పాటు చైనా నిర్మిస్తున్న బీఆర్ఐ ప్రాజెక్ట్‌కు ముప్పు తెచ్చే అవ‌కాశం లేక‌పోలేదు.  ఇన్ని భ‌యాల‌తోనే పాక్ హ‌డావుడిగా ఆఫ్ఘ‌న్‌-పాక్ స‌రిహ‌ద్దు వెంట వేగంగా కంచెను ఏర్పాటు చేసింది.  

Read: అప్పుడు బుద్దుడి విగ్ర‌హం…ఇప్పుడు హ‌జారా నాయ‌కుడి విగ్ర‌హం…

Exit mobile version