Site icon NTV Telugu

Queen Elizabeth II: విక్టోరియా రాణి మృతి.. ఇప్పుడు కోహినూర్ ఆమె సిగలోకే..?

Princes

Princes

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ II 70 ఏళ్ల పరిపాలన తర్వాత గత రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆమె మరణం తరువాత ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..? ఆమె వద్ద ఉన్న అరుదైన వజ్రం కోహినూర్ ను ధరించేది ఎవరు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విక్టోరియా మహారాణి వద్ద ఉన్న 2,800 వజ్రాల్లో కోహినూర్ వజ్రం అరుదైనది. విలువైనది. ఆ వజ్రం నిత్యం ఆమె ధరించే కిరీటంలో పొందుపర్చి ఉంటుంది. ఇక ఆ వజ్రానికి పెద్ద చరిత్రే ఉంది. 1937 లో ఈ వజ్రాన్ని తయారుచేశారు. ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. ఇక ఎలిజిబెత్ మృతి చెందాకా ఆ కోహినూర్ ను ధరించే అవకాశం ఆమె కోడలు కెమిల్లా అందుకొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎలిజిబెత్ మరణం తరువాత ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు ప్రిన్స్ చార్లెస్ 3 ను రాజుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. అతనే కనుక రాజైతే అతని భార్య కెమిల్లా రాణిగా అధికారం చేపట్టనుంది. రాణిగా బాధ్యతలు చేపట్టినవారికే ఆ కీరిటం దక్కుతుంది కాబట్టి ఆ కోహినూర్ కూడా ఇప్పుడు ఆమె సిగలోకే వెళ్లనుంది అంటున్నారు. అయితే ఈ విషయాన్నీ రాణి కూడా బ్రిటన్ ప్లాటినం వేడుకల్లో అధికారికంగా చెప్పుకొచ్చారు. తన తరువాత ఈ రాణి హోదా కెమిల్లాకే చెందుతున్నదని తెలిపింది. అయితే కెమిల్లా చార్లెస్ రెండో భార్య.. ముందు అతను ప్రిన్సెస్ డయానాను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. విబేధాలు కారణంగా ఈ జంట విడిపోయారు. విడిపోయిన ఒక ఏడాదికే డయానా యాక్సిడెంట్ లో మృతిచెందింది. ఇక అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న కెమిల్లాను చార్లెస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇక మొదటి భార్య లేకపోవడంతో రాణి హోదా కెమిల్లాకే చెందుతుందని చెప్పొచ్చు. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Exit mobile version