Site icon NTV Telugu

Bangladesh Violence: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకి హత్య.. ఇంతకీ ఎవరీ ఉస్మాన్‌ హాదీ..?

Ban

Ban

Bangladesh Violence: స్టూడెంట్ లీడర్ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. విద్యార్థి ఉద్యమంతో హసీనా సర్కార్ ను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు దుండగుల చేతిలో తన ప్రాణాలను కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తున్నాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారాయి. అయితే, ఇంతకీ ఎవరీ ఉస్మాన్‌ హాదీ..?

Read Also: Venky Atluri : లక్కీభాస్కర్ కు సీక్వెల్ చేసే ఆలోచనలో వెంకీ అట్లూరి

కాగా, బంగ్లాదేశ్‌లోని ఝల్‌కాతీ జిల్లాలో 1994లో షరీఫ్ ఉస్మాన్‌ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉన్న అతడు.. విద్యార్థి లీడర్ గా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీ లీగ్‌ నేత, నాటి ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీ రోల్ పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్‌ మంచ్‌ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేక కామెంట్స్ చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను పంచినట్లు తాజాగా వార్తలు బయటకు వచ్చాయి.

Read Also: Gudivada Amarnath: వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.. ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి ఉంది..

అయితే, గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు.. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతో షరీఫ్ ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెంబర్ 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు గత శనివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం నాడు మరణించాడు.

Read Also: Delhi Firing: రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ.. 52 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు

ఇక, ఉస్మాన్‌ హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు ప్రారంభమైయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్‌ మంచ్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. భారత్‌, అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీలీగ్‌ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి.

Exit mobile version