కరోనా మహమ్మారిపై ప్రపంచం పోరాటం చేస్తున్నది. కరోనా నుంచి ఇప్పటి వరకూ ఏ దేశం కూడా పూర్తిగా కోలుకోలేదు. తగ్గినట్టే తగ్గి కేసులు మరలా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో టీకాలు వేగంగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుగానే కోట్లాది డోసులు సమకూర్చుకున్నాయి. మధ్య, పేద దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో రెండు రకాల వ్యాక్సిన్లు తయారవుతుండగా, రోజూ 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో మూడు వ్యాక్సిన్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మలేరియా ఔషధం ఆర్టేసునేట్, క్యాన్సర్‌కు వాడే ఇమేటినిబ్, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి వినియోగిస్తున్న ఇన్‌ఫ్లిక్సిమాబ్ వ్యాక్సిన్లు ఎంత మేరకు పనిచేస్తాయి అనే దానిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ పరిశోధనలు చేస్తున్నది. ఆఫ్రికా ఖండంలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ను అందించినట్టు గణాంకాలు చేబుతున్నాయి. ఆఫ్రికా ఖండానికి వ్యాక్సిన్‌లను అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ దేశాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.
కోవిడ్ టీకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు…
