NTV Telugu Site icon

Vadim Krasikov: అతని కోసం అమెరికాతో పుతిన్ ఒప్పందం.. ఎవరీ క్రషికోవ్, ఎందుకంత ముఖ్యం..

Vadim Krasikov

Vadim Krasikov

Vadim Krasikov: వాదీం క్రాషికోవ్ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా, వెస్ట్రన్ దేశాలతో ఖైదీల మార్పిడి ఒప్పందం చేసుకున్నారు. జర్మనీలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న క్రషికోవ్‌ ఈ ఒప్పందంలో భాగంగా రష్యా చేరుకున్నాడు. పుతిన్ నేరుగా విమానాశ్రయం వెళ్లి, క్రషికోవ్‌కి సాదరంగా స్వాగతం పలికారు. క్రషికోవ్‌తో పాటు మరో 8 మంది మంది రష్యాకు చెందిన వారిని అమెరికా విడుదల చేసింది. వీరిలో పలువురు అండర్ కవర్ ఏజెంట్లు ఉన్నారు. బదులుగా రష్యా వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన పాల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేసింది.

ఎవరీ క్రషికోవ్:

క్రిషికోవ్ రష్యా టాప్ రేటెడ్ హిట్ మ్యాన్‌గా పేరు సంపాదించుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా, కంటిలో నలుసుగా మారిన వారిని వేటాడి వెంటాడి చంపాడు. ముఖ్యం విదేశాల్లో రష్యా తరుపున అసైన్‌మెంట్లు పూర్తి చేయడంలో దిట్ట. రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్‌బీలో చేరిన కొన్నాళ్లకే, పుతిన్‌కి ముఖ్యమైన వ్యక్తిగా మారారు. అందుకే పుతిన్ ఇంత రిస్క్ చేసి అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు.

క్రషికోవ్ జర్మనీకి ఎలా చిక్కాడు..?

2019 ఆగస్టులో జర్మనీ రాజధాని బెర్లిన్‌లో అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో సైకిల్ పై వస్తున్న ఓ వ్యక్తి, చెచెన్ రెబెల్ జెలీంఖాన్‌ని కాల్చి చంపి, క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ ఘటనను చూసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే క్లీన్ షేవ్ చేసుకుని, విగ్గుతీసేసి తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు వదీం క్రషికోవ్.

అయితే, ప్రత్యక్ష సాక్ష్యలు ఇతడిని గుర్తించడంతో జర్మనీకి పట్టుబడ్డాడు. ఈ హత్య కేసులో అతడికి జీవితఖైదు విధించబడింది. ముందుగా తాను ఈ హత్య చేయలేదని బుకాయించినప్పటికీ, ఆ తర్వాత ఇది తామే చేశామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా అంగీకరించాడు. క్రషికోవ్‌ని ‘గొప్ప దేశభక్తుడి’ పుతిన్ కొనియాడారు.