Site icon NTV Telugu

బ్రిట‌న్‌కు త‌దుప‌రి రాణి ఆమెనా…?

బ్రిట‌న్‌కు కొత్త రాణి రాబోతున్న‌దా అంటే అవున‌నే అంటున్న‌ది ఎలిజిబిత్ 2. గ‌త 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిట‌న్‌కు మ‌హరాణిగా ఉంటున్నారు. ఆమె త‌రువాత మ‌హ‌రాణి ఎవ‌రూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. త‌న త‌రువాత మ‌హరాణి హోదాను త‌న కోడ‌లు కెమిల్లాకు ఇవ్వాల‌ని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా ద‌క్క‌నుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య‌. మొద‌టి భార్య డ‌యానా కారు ప్ర‌మాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. చార్లెస్ మొద‌ట ప్రిన్సెస్ డ‌యానాను వివాహం చేసుకున్నారు. అయితే, 1996లో డ‌యానా.. చార్లెస్ విడాకులు తీసుకున్నారు.

Read: హ్యుందాయ్‌పై తీవ్ర‌ప్ర‌భావం చూపిన ఆ పోస్ట్‌… నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం…

విడాకులు తీసుకున్న ఏడాదికి డ‌యానా కారుప్ర‌మాదంలో మృతి చెందింది. ఆ త‌రువాత 2005లో చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నారు. ఎలిజిబిత్ 2 బ్రిట‌న్ మ‌హరాణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి 70 ఏళ్లు పూర్త‌య్యిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎలిజిబిత్ 2 త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. త‌న కోడ‌లు కెమిల్లాను త‌దుప‌రి రాణిగా చూడాల‌న్న‌ది త‌న ఆకాంక్ష అని, ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఇచ్చిన మ‌ద్ద‌తును తారువాత త‌న కుమారుడు చార్లెస్‌, కెమిల్లాల‌కు కూడా అందివ్వాల‌ని అన్నారు. మ‌రి ఎలిజిబిత్ 2 కోరిక నెర‌వేరుతుందా చూడాలి.

Exit mobile version