NTV Telugu Site icon

Mahrang Baloch: బలూచిస్తాన్‌ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..

Mahrang Baloch

Mahrang Baloch

Mahrang Baloch: పాకిస్తాన్‌లో స్వాతంత్య్రం కోసం పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకం నిరసన తెలియజేస్తున్నారు. తమతో కలిసి ఉండే వారిని పాక్ ప్రభుత్వం అధికారులు అపహరించి హత్యలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్న వారు పాక్ పోలీసులు, సైన్యం అపహరించి హత్యలకు పాల్పడుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పాక్ ప్రభుత్వానికి ఎదురునిలిచిన వారిని పాకిస్తాన్ హత్యలు చేస్తోందని ప్రధాన ఆరోపణ.

ఇటీవల బలూచిస్తాన్ ప్రజలు ఇటీవల గ్వాదర్‌లో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, సొంత ప్రజలను అక్కడి పాక్ ఆర్మీ కాల్చి చంపింది. ఈ ఘర్షణల్లో 10 మందికి పైగా ప్రజలు మరణించారని, వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Read Also: Bengaluru Traffic: కారులో వెళ్తే 44 నిమిషాలు, నడిచివెళ్తే 42 నిమిషాలు.. బెంగళూర్‌లో ట్రాఫిక్ పద్మవ్యూహం..

మహరంగ్ బలోచ్.. పాకిస్తాన్‌ని వణికిస్తోంది:

ఒక్క మహిళ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె పేరు ‘మహరంగ్ బలోచ్’. సామాజిక కార్యకర్త, హక్కుల ప్రతినిధిగా ఉన్న మహరంగ్ ప్రస్తుతం బలూచిస్తాన్ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బలూచ్ హక్కులు, స్వేచ్ఛ కోసం నినదిస్తోంది. పాకిస్తాన్‌లో ఖనిజ వనరులకు బలూచిస్తాన్ కేంద్రంగా ఉంది. దీనిపై చైనా కన్నేసింది. ఈ నేపథ్యంలో తమ భూమిపై వేరే వారి పెత్తనం ఏంటని అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు.

ఫిబ్రవరి 3, 1993న, బలూచిస్తాన్‌లోని కలాత్‌లో జన్మించిన మహరాంగ్, బోలన్ మెడికల్ కాలేజీలో MBBS పూర్తిచేశారు. ఆమె తండ్రి బలూచ్ జాతీయవాది అయిన అబ్దుల్ గఫార్ లాంగో. బలూచ్ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆయనను అపహరించి, హత్య చేశారు. బలూచ్ స్వాతంత్య్రం కోసం నినదించే వారిని తన తండ్రిలాగే అహహరించి, హత్యలు చేస్తుండటంపై మహరంగ్ బలోచ్ ప్రస్తుతం ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తున్నారు. ఈ పోరులో ఆమె తన సోదరుడిని కూడా కోల్పోయింది.