కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది.. మళ్లీ కరోనా కల్లోలం సృష్టించబోతోంది అని హెచ్చరించింది.. గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియేసస్.. మరో రెండు వారాల్లోగా ఆ సంఖ్య 20 కోట్లకు చేరుతోందని తెలిపారు.. అంటే రానున్న రెండో వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల మందికి కరోనా సోకుతుందని అంచనా వేసింది డబ్ల్యూహెచ్‌వో.. ప్రస్తుతం వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల తీరును పరిశీలిస్తూ.. ఈ అంచనా వేశారు.. ఇక, ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే.. మరింత ఎక్కువగానే ఉండొచ్చని శుక్రవారం రోజు మీడియాకు వెల్లడించారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్.. ఇదే కాకంగా.. అనేక దేశాల్లో డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం విదితమే.
కరోనా వైరస్.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్..

WHO