కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌లో వ్యాపిస్తున్నాయి. 130కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కు ఈ వేరియంటే కారణం. దీని వలన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటుగా కొన్ని పశ్చిమాసియా దేశాల్లో బూస్టర్ డోస్ కింద మూడో డోస్‌ను ప్రజలకు అందించడం మొదలుపెట్టారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ ను ఇవ్వడంపై ప్రణాళికలు వేస్తున్నారు. ప్రపంచంలో కనీసం 10శాతం మందికి రెండు డోసులు వేసేలా ముందు చర్యలు తీసుకోవాలని ఆ తరువాత మూడో డోస్ గురించి ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కోరారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా మొదటి డోస్ పూర్తి కాలేదని, అనేక దేశాల్లో వ్యాక్సిన్ కొరతలు ఉన్నాయని, ఆయా దేశాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. కనీసం సెప్టెంబర్ వరకు బూస్టర్ డోస్ ఆలోచనను మానుకోవాలని ఆయన సూచించారు.
Read: సురేఖావాణి@బిగ్ బాస్ 5
