Site icon NTV Telugu

Trump: పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటన వార్తలపై స్పందించిన వైట్‌హౌస్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు పాకిస్థాన్ మీడియా గురువారం వార్తలు ఊదరగొట్టింది. దక్షిణాసియా పర్యటనలో భాగంగా ట్రంప్ సెప్టెంబర్ 18న ఇస్లామాబాద్‌లో పర్యటిస్తారని.. అనంతరం భారత్‌లో పర్యటిస్తారని ఛానళ్లు వార్తలు ప్రచారం చేశాయి. అంతేకాకుండా రాయిటర్స్ కూడా ఊహాగానాలు వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం

తాజాగా పాకిస్థాన్‌లో ప్రసారం అయిన వార్తలపై వైట్‌‌హౌస్ స్పందించింది. పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటిస్తున్నట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. పాకిస్థాన్‌లో ట్రంప్ షెడ్యూల్ లేదని.. పాకిస్థాన్ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ప్రస్తుతానికైతే అలాంటి పర్యటన షెడ్యూల్ ఏదీ లేదని వైట్‌హౌస్ పేర్కొంది. ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ కూడా తెలిపారు.

ఇది కూడా చదవండి: Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇంతకీ హత్యా..? పరువు హత్యా..?

ఇక ట్రంప్ జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్‌లో పర్యటించనున్నట్లు యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు వివరించారు. ఈ పర్యటన సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ట్రంప్ వాణిజ్య చర్చలు జరుపుతారని లీవట్ పేర్కొ్న్నారు. టర్న్‌బెర్రీ, అబెర్డైన్‌ను ట్రంప్ సందర్శిస్తారని తెలిపింది. అమెరికా-యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసమే ట్రంప్ పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Exit mobile version