Site icon NTV Telugu

PM Benjamin Netanyahu: “యూదు స్త్రీలు కాబట్టే మౌనంగా ఉన్నారా..?” హక్కుల సంఘాలపై ఇజ్రాయిల్ పీఏం ఆగ్రహం..

Pm Netanyahu

Pm Netanyahu

PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు.

నాగరిక దేశాలు, ప్రభుత్వాలు, నాయకులు, ప్రభుత్వాలు ఈ దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. టెల్ అవీవ్‌లో రక్షణ మంత్రి యోవ్ గాలంట్, బెన్నీ గాంట్జ్‌తో కలిసి ప్రధాని నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. విడుదలైన బందీలు వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారని చెప్పారు. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి తెలసుకున్నానని..దీనిపై మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు మొరపెట్టుకున్నా వినలేదని, యూదు స్త్రీలు కాబట్టే మౌనంగా ఉన్నారా?? అని నెతన్యాహు ప్రశ్నించారు.

Read Also: Floods: ఒక్క చెన్నై మాత్రమే కాదు.. శతాబ్దం చివరి నాటికి వరద ప్రమాదంలో 12 నగరాలు..

మీరంతా యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటే.. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇవ్వండి, హమాస్‌ని అణిచివేయడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న ఏకైక మార్గమని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్-హమాస్ మధ్య దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు చర్చిస్తున్నాయి. దీర్ఘ కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మిగతా బందీలను విడుదల చేస్తామని హమాస్ షరతు పెడుతున్నట్లుగా సమాచారం. ఇటీవల కుదిరిన సంధితో 240 మంది బందీల్లో కొంతమందిని హమాస్ విడుదల చేసింది, ప్రస్తుతం హమాస్ వద్ద 137 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది.

Exit mobile version