NTV Telugu Site icon

Bomb Cyclone: అమెరికాకు పొంచి ఉన్న బాంబ్ సైక్లోన్.. భీకర గాలులు.. వర్షాలు కురిసే అవకాశం

Bombcyclone

Bombcyclone

బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కారణంగా తీవ్ర ప్రళయం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ విలయం సృష్టించే అవకాశాలున్నాయని సమాచారం. కాలిఫోర్నియా సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సుమారు 8 ట్రిలియన్‌ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బాంబ్‌ సైక్లోన్‌ అంటే..?
‘‘బాంబ్ సైక్లోన్’’ అనే పదాన్ని వాతావరణ శాస్త్రజ్ఞులు 1980లలో స్థాపించారు. వెచ్చని, తేమతో కూడిన ఉష్ణమండల గాలి కారణంగా ఈ తుఫాన్ బలపడుతుంది. బాంబ్‌ సైక్లోన్‌ అనే పదం బాంబోజెనిసిస్‌ నుంచి వచ్చింది. గంటల వ్యవధిలోనే తుఫాను బలపడే పరిణామాన్ని బాంబ్‌ సైక్లోన్‌గా పిలుస్తారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో కనీసం 24 మిల్లీబార్లు అంతకంటే ఎక్కువ మేర వాతావరణ పీడనం పడిపోవడాన్ని ఈ తరహా సైక్లోన్‌గా పరిగణిస్తారు. హరికేన్‌ స్థాయిలో గాలులు వీయడంతో పాటు భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది.

మంగళవారం-గురువారం మధ్య సమీపించే తుఫాను 24 గంటల్లో 50 నుంచి 60 మిల్లీబార్‌ల వరకు పీడనం తగ్గుతుందని సూచించారు. సోమవారం రాత్రి 1000 మిల్లీబార్లకుపైగా ప్రారంభమైన ఈ పీడనం మంగళవారం రాత్రికి 950 మిల్లీబార్లకు దిగువకు పడిపోవచ్చు. తక్కువ పీడన రీడింగులు పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి